గుంతకల్లు: గుత్తి మండలం కొత్తపేట శివారులో జాతీయ రహదారిపై టైరు పేలి కారు బోల్తా, సాఫ్ట్ వేర్ ఇంజనీరు కు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు టైరు పేలి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సునీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన సునీల్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేసేవాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కారులో వెళ్తుండగా గుత్తి మండలం కొత్తపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై బైపాస్ బ్రిడ్జి పైన సోమవారం వేకువజామున టైరు పేలి కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారు డివైడర్ ను ఢీకొని సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు.