గుంతకల్లు: గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో వ్యక్తికి పాము కాటు, పరిస్థితి విషయం, అనంతపురంకు తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ధర్మాపురం గ్రామంలో సుంకన్న అనే వ్యక్తి గురువారం పాము కాటుతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సుంకన్న ఇంటి వద్ద రాళ్లు తొలగిస్తుండగా రాళ్ల కింద ఉన్న పాము కాటు వేసింది. నొప్పి అధికంగా ఉండటంతో అనుమానం వచ్చి రాళ్లు తొలగించి చూడగా పాము కనిపించింది. దీంతో స్థానికుల సాయంతో పామును చంపి వేశారు. అనంతరం చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురంకు తీసుకెళ్ళారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.