ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం రక్షిత మంచినీటి పథకం కుళాయిల్లో కలుషితనీరు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా కలుషిత నీరు వస్తుందని గ్రామస్తులు తెలిపారు, స్థానిక ఇందిరమ్మ కాలనీలో రంగు నీరు వస్తుండడంతో ఈ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు స్థానిక ప్రజలు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించడం లేదని వాపోయారు