సిద్దిపేట అర్బన్: తెలంగాణ బతుకమ్మ పండుగకు గొప్ప ప్రత్యేకత ఉంది : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
తెలంగాణ లో బతుకమ్మ పండగకి గొప్ప ప్రత్యేకత ఉందని, కేసీఆర్ ఉద్యమం ప్రారంభం చేశాక అయ్యాక ఈ పండగకి విశ్వ ఖ్యాతి వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పై జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ..తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ పండగనీ అధికారికంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండగకి గుర్తింపు రాలేదని ఇంత గొప్ప గౌరవం దొరకలేదన్నారు.నేడు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ను అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉన్నవారు చాలా గొప్పగా బతుకమ్మ పండుగ జారుకుంటున్నారు.