గుంతకల్లు: గుత్తి మండలం ఊటకల్లు శివారులో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థికి గాయాలు, తప్పిన పెను ప్రమాదం
అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామ శివారులో ఏవీఆర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి ఓ విద్యార్థి గాయపడగా ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి అర్ఎస్ చంద్రప్రియ నగర్ సమీపంలో ఉన్న ఏవీఅర్ ప్రైవేట్ స్కూల్ బస్సు కర్నూలు, నంద్యాల జిల్లాలలోని విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు వెళ్ళింది. మొదట కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పర్లపల్లిలో ఓ విద్యార్థిని ఎక్కించుకుని అనంతరం రోళ్ళపాడు తండా గ్రామంలో మరో విద్యార్థిని ఎక్కించుకుని వస్తుండగా బోల్తా పడింది.