మదనపల్లె: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో సోమవారం వాటర్ ట్యాంకర్ బోల్తా పడి, డ్రైవర్ హుస్సేన్ కు తీవ్ర గాయాలు
వాటర్ ట్యాంకర్ బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ సంఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. ఘటనపై వన్ టౌన్ పోలీసుల కథనం.. రెడ్డీస్ కాలనీకి చెందిన హుస్సేన్ వాటర్ ట్యాంకర్ నడుపుకొని ఉదయం స్థానికంగా ఉండే ఇళ్లకు మినరల్ వాటర్ సప్లై చేస్తుంటాడు. ఈ క్రమంలో ట్యాంకర్ ను నడూపుతుండగా, కాలనీలో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హుసేన్ ను108 దివ్య, సర్దార్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు