అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ కు చెందిన అబ్దుల్ బషీర్ అనే వ్యక్తి ఈస్ట్ ఆఫ్రికాలోని లైబిరియాలో గుండెపోటుతో మృతి చెందగా 11 రోజుల తరువాత మృతదేహం గుత్తికి చేరింది. వివరాలిలా ఉన్నాయి. గుత్తి అర్ఎస్ కు చెందిన అబ్దుల్ బషీర్ అనే వ్యక్తి లైబిరియాలో పవర్ ప్లాంట్ లో సైట్ ఇంజనీర్ గా పని చేసేవాడు. గత 26 రోజుల క్రితమే అతడు లైబిరియాకు వెళ్ళాడు. కాగా ఈ నెల 14న ఛాతీలో నొప్పి రాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా అక్కడి ప్రభుత్వ అనుమతులు పూర్తి చేసుకొని హైదరాబాద్ కు చేరుకున్న మృతదేహాన్ని గుత్తికి తెచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.