శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,హుండీ లెక్కింపు నిర్వహించారు,చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 72 లక్షల 50 వేల 251 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు,ఈ ఆదాయాన్ని గత 21 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 158 గ్రాముల 200 మిల్లి గ్రాములు బంగారం,అలానే వెండి 11 కేజీల 460 గ్రాములు లభించాయి, వీటితోపాటు విదేశీ కరెన్సీ కూడా లభించాయని ఈవో తెలియజేశారు.