ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ; దైవందీన్నేలో సంవత్సరం క్రితం తన తండ్రి మరణించాడని, తల్లికి పింఛన్ ఇవ్వాలని 14 సం. సంకటి ప్రసన్న వేడుకలు..
ఎమ్మిగనూరు: పెన్షన్ ఇచ్చి మమ్మల్ని బ్రతికించండి అయ్యా.! మండల పరిధిలోని దైవందీన్నేలో సంవత్సరం క్రితం తన తండ్రి మరణించాడని, తల్లికి పింఛన్ ఇవ్వాలని 14 సం. సంకటి ప్రసన్న ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ కూడా పక్షవాతంతో కొట్టుమిట్టలాడుతుందని, తమకు ఆస్తిపాస్తులు ఏమీ లేవని వాపోయాడు. ఆమ్మకు కావాల్సిన మందుల కోసం చదువు మానేసి కూలి పనులు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి బాలుడి అమ్మకు చికిత్స అందించి, పింఛన్ ఇప్పించాలని కోరుతున్నాడు.