మండపేట: తాపేశ్వరం పోలిశెట్టి సత్తిరాజు భూషణం జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు వీరన్న పదవీ విరమణ సత్కార మహోత్సవం..
అంకిత భావం తో విధులు నిర్వహిస్తూ ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన గుణ్ణం వీరన్న సేవలు ఆదర్శమని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత,పోలిశెట్టి మల్లిబాబు ఆన్నారు. ఉపాధ్యాయులు వీరన్న పదవీ విరమణ సత్కార కార్యక్రమం పోలిశెట్టి సత్తిరాజు భూషణం జెడ్పీ హై స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు కార్యక్రమం లో పాల్గొని వీరన్న అంటే విద్యార్థుల్లో భయభక్తులు వుండేవన్నారు. ఆ కారణంగానే ఆయన బోధించే సబ్జెక్ట్ లను ఎందరో విద్యార్థులు బాధ్యతగా నేర్చుకుని మంచి ఫలితాలు సాధించారన్నారు.అనంతరం వీరన్న దంపతులను పలువురు పూలదండలు, దుశ్శలువాలు, జ్ఞాపికలు, బొకెలతో ముంచెత్తారు.