జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారుని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
Ongole Urban, Prakasam | Mar 26, 2026
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారుని కలెక్టరేట్లోని తన కార్యాలయంలో కలిసి పలు అంశాల గురించి సమీక్షించారు ప్రధానంగా సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను చర్చించారు ప్రధానంగా రామతీర్థం చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను మరియు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను మంచినీటి సరఫరాకు సంబంధించిన పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు