నకిరేకల్: ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నకిరేకల్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారి నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు.