గన్నవరం: కొండపావులూరు, సూరంపల్లి రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన
కొండపావులూరు–కట్టుబడిపాలెం రోడ్డుకు రూ.55 లక్షలు, సూరంపల్లి–రామచంద్రాపురం రోడ్డుకు రూ.1.39 కోట్లతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి నోచుకోని గ్రామాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు.