సంగారెడ్డి: గిరిజన మహిళ హత్య, నిందితుడి అరెస్ట్ : కేసు వివరాలు వెల్లడించిన మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్ జిల్లా కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుపాయల మొదటి వంతెన వద్ద జరిగిన గిరిజన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. నిందితుడు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సంగోజీగూడకు చెందని మెగావత్ ఫకీరా నాయక్ గుర్తించారు. మహిళపై అత్యాచారం, వివస్త్రను చేసిన హత్య చేశాడన్నారు. ఇతనికి పాత నేర చరిత్ర ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కేసును చేదించిన పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.