శ్రీశైలం: మహానంది మండలంలో ఘనంగా బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం. బిజెపి జెండా ఎగరవేసిన కార్యకర్తలు
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. భారతదేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి దేశంగా ప్రగతి పథంలో ముందుకు తీసుకెళుతుంది అన్నారు. వికసిత్ భారత్, సుపరిపాలన లక్ష్యంగా నేడు దేశంలో పరిపాలన కొనసాగుతుందని అన్నారు.బీజేపీ అధికారంలో ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని బీజేపీ మండల అధ్యక్షుడు కేఈ కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు.