శ్రీశైలం: ఎర్రగుడూరు గ్రామం వద్ద షోరూం ట్రాక్టర్ బోల్తా. డ్రైవర్ తిరుపతయ్య అక్కడికక్కడే మృతి
నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగుడూరు గ్రామం సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షోరూం ట్రాక్టర్లను డెలివరీ కోసం గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకువెళ్తున్న సమయంలో ఒక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.