జై జగన్ నినాదాలతో మారుమోగిన మడకశిర పట్టణం
మడకశిర పట్టణంలో బుధవారం వైకాపాశ్రేణులు జై జగన్ నినాదాలతో మార్మోగించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు పార్టీ జెండాలు చేత పట్టుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఈర లక్కప్ప ఎంపీటీసీలు జడ్పిటిసిలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.