నాగులుప్పలపాడు: సంతనూతలపాడు: కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు: నాగులుప్పలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు
నాగులుప్పలపాడు: ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రజల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలిగామని,, అదేవిధంగా జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలని నాగులు పొలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు కోరారు. నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పీస్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు అల్లర్లు జరగకుండా సహకరించాలన్నారు.