వేసవి సెలవులు కావడంతో తాపీ పనికి వెళ్లి విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి నౌమన్
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి నౌమన్ మృతి చెందాడు.వేసవి సెలవుల కారణంగా తాపీ పనికి వెళ్లిన నౌమన్, పని మధ్యలో టీ తాగిన అనంతరం గ్లాస్‌ను పడేయడానికి వెళ్లాడు.ఈ సమయంలో ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు వెలుగోడు పట్టణానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.