శ్రీశైలం: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణ పై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా
మహిళలను కించపరుస్తూ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను వెన్నెముకలేని బ్యాచ్‌గా అభివర్ణించడం మీడియా స్థాయిలో ఉన్న వ్యక్తులకు తగదని విమర్శించారు.గత రెండేళ్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నించే మీడియాపై కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నారన్నారు.