శ్రీశైలం: ఈ సంవత్సరంలో మొదటిసారిగా శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ( 1,140 క్యూసెక్కుల) వచ్చి చేరుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా 1,140 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 821.80 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. జలాశయంలో 42.1486 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు నీటి విడుదల లేదు. నీటిమట్టం తక్కువగా ఉండటంతో కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.