పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పట్టణంలోని దివ్య నగర్ లో గల పార్కులో వన మహోత్సవంలో భాగంగా శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవాన్ని నిర్వహిస్తుందని ఇందులో భాగంగా ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి మించి మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు.