నంద్యాల అర్బన్: నంద్యాల సమీపంలో కేసీ కెనాల్లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
Nandyal Urban, Nandyal | Apr 10, 2026
నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద విషాదం నెలకొంది. గురువారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన సోహెల్ (15) అనే బాలుడు, శుక్రవారం ఉదయం చెక్ డ్యామ్ వద్ద మృతి చెంది కనిపించాడు. ప్రమాదవశాత్తు కాల్వలో మునిగి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.