సిద్దిపేట అర్బన్: పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే మరో ఉద్యమానికి ఏబీవీపీ రూపకల్పన చేస్తుంది : జిల్లా ఏబీవీపీ కన్వీనర్ ఆదిత్య
గురుకుల పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సిద్దిపేట జిల్లా ఏబీవీపీ కన్వీనర్ ఆదిత్య అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. 21 నెలల కాంగ్రెస్ పాలనలో కళాశాలలను స్వయంగా యాజమాన్యాలే బంద్ చేయడం ఇది రెండోసారి అని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. విద్యార్థులకు ఫీజు చెల్లించాలని అడిగితే ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం భాధాకరమన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టు ప్రభుత్వం ఏమాత్రం పట