కాకినాడ సిటీ: చాట్‌జీపీటీ సాయంతో హత్య: ఏఈ అల్లుడు జగదీశ్వరరెడ్డి కేసులో షాకింగ్ విషయాలు
పంచాయతీరాజ్ ఏఈ అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ చాట్‌జీపీటీ ద్వారా విష ప్రయోగం వివరాలు సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 60 వేల రూపాయలతో విషాన్ని కొనుగోలు చేసి కొబ్బరి నీళ్లు, ప్రోటీన్ పౌడర్‌లో కలిపి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.