పెద్దాపురం ఏరియా హాస్పిటల్ నందు స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్.
కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరియా ఆసుపత్రి నందు, శ్రీవిద్య ఆధ్వర్యంలో, శుక్రవారం ఉదయం స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్, కార్యక్రమాన్ని డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాజా సూరిబాబు రాజు, ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అదేవిధంగా సమాజం కూడా చాలా మెరుగుపడుతుందని అన్నారు.