మండపేట: ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో మండపేట శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.
ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో మండపేట శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పది పరీక్ష ఫలితాల్లో శ్రీ గౌతమి మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్న ఎస్.పావని దుర్గ 560 మార్కులతో పాఠశాల మొదటి స్థానాన్ని పొందింది. కే లావణ్య 555 మార్కులతో ద్వితీయ స్థానాన్ని , ఈ పూజిత 542 మార్కులతో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థినిలు అందరినీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ . శోభావళి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వి సూర్యలత సోమవారం మధ్యాహ్నం విద్యార్థులును అభినందించారు