ఆళ్లగడ్డ: రుద్రవరం మండల పరిషత్ నామినేషన్ కార్యాలయం వద్ద టీడిపి వైసీపి వర్గాల మధ్య తోపులాట
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిషత్ నామినేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది నామినేషన్ కేంద్రం వద్దకు టిడిపి, వైసిపి వర్గాలు గుంపులు గుంపులుగా చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది వెంటనే స్పందించిన సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్సైలు మహమ్మద్ రఫీ, పీరయ్య సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు