హత్నూర: పోలియో ఆదివారం హత్నూర మండలంలో విజయవంతం,
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో పోలియో ఆదివారం విజయవంతం. మండలంలోని కాసాల దౌల్తాబాద్ నస్తీపూర్ దేవులపల్లి సిరిపురం టికేపూర్ తదితర గ్రామాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు ఆదివారం వేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.