నసురుల్లాబాద్: అంకోల్ లో ఫార్మర్ రిజిస్ట్రీలో లెక్క పక్కగా ఉండాలి : ఏఈఓ సాయి సుమన్
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగు లెక్క పక్కాగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఏఈఓ సాయి సుమన్ తెలిపారు. ప్రతి రైతు భూములకు సంబంధించి వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు.