డోన్: బేతంచర్ల లో జరిగిన అభివృద్ధి ప్రజలకు చెప్పాలి : మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Oct 3, 2026 బేతంచెర్లలో అభివృద్ధిపై బుగ్గన ప్రశ్నలు! టీడీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బేతంచెర్లలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు.