ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థులు డీఎస్సీకి ఎంపికయ్యారని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో అభినందన..
ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థులు డీఎస్సీకి ఎంపికయ్యారని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ గారు అసెంబ్లీ వేదికగా తెలిపారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులు ఎమ్మెల్యే డాక్టర్బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తో సెల్ఫీలు తీసుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందన్నారు. సభా ఏర్పాట్లలో కొన్ని లోపాలు తలెత్తాయని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.