శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తుల రద్దీ. రెండు రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలు నిలుపుదల
వారాంతపు సెలువు దినాలు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ భారిగా పెరిగింది.ఈ మేరకు అధికారులు ఈరోజు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు విఐపి దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలియజేశారు. సిఫార్సు లేఖలతో వచ్చే వారందరికీ కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామను అన్నారు. అలాగే మనమిత్ర వాట్సప్ మరియు ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం బుకింగ్ చేసుకున్న భక్తులకు నిర్దిష్ట సమయంలో అనుమతి ఉంటుందని రద్దీ నేపథ్యంలో క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు మంచినీరు అల్పాహారం అందజేస్తున్నారని ఈ ఓ శ్రీనివాసరావు తెలియజేశారు.