గుంతకల్లు: గుత్తి పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీ సమీపంలో మహిళపై దాడి, చోరికి యత్నం, గాయపడిన మహిళ, పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీ సమీపంలో చాకలి లక్ష్మీదేవి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి చోరికి యత్నించారు. ఆదివారం బాధితురాలు లక్ష్మీదేవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీలో నివసిస్తున్న చాకలి లక్ష్మీదేవి అనే మహిళ అనంతపురం రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్ లో పని చేసేది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా కాలనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి చోరికి యత్నించాడు. అయితే ఆమె చెవి తెగి గాయపడింది. ఎస్ఐ సురేష్ విచారించారు.