మద్దూర్: ఏప్రిల్ 21 నుండి ప్రారంభం కానున్న తిమ్మారెడ్డిపల్లి బావోజి జాతర మహోత్సవాలు. ..
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 21వ తేదీ నుండిగిరిజనుల ఆరాధ్య దైవం బావోజీ జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులను ఏర్పాటు చేశామని, ఏప్రిల్ 23వ తేదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిదర్శించుకోనున్నారని తెలిపారు.