ఆళ్లగడ్డ: రుద్రవరం మండలంలోని కొండ వాగులో భారీ చేపల లభ్యం
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం లోని కొండ వాగు కాలువలో చేపలు పట్టుకుంటున్న యువకులకు భారీ చేప లభించింది, కొద్ది రోజులుగా తెలుగు గంగా కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేపల వేటను ప్రారంభించారు, నన్నే చరణ్ కు 25 కేజీలకు పైగా ఉన్న భారీ చేప దొరికింది రుద్రవరం మండలంలో ఇంత పెద్ద చేప ఎప్పుడు ఎవరికీ దొరకలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు