గజపతినగరం: గంట్యాడలో ముమ్మరంగా వాహన తనిఖీలు: నగదు, వస్తువుల అక్రమ రవాణాపై పోలీసుల నిఘా
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంట్యాడలో పోలీసులు డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ నగదు, వస్తువుల తరలింపును అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.