కర్నూలు ధర్నా చౌక్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వాజ్‌పేయి ఎల్లప్పుడూ చెప్పిన విలువలను యువత అనుసరించాలని కోరారు. యువత ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్, కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.