అదిలాబాద్ అర్బన్: నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష: అధికారులకు కీలక ఆదేశాలు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.