కాకినాడ రూరల్: కాజులూరులో 16 మందిపై బైండోవర్ కేసులు: తుపాకీ స్వాధీనం
ఎన్నికల ప్రశాంతత కోసం కాజులూరులో 16 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు గొల్లపాలెం ఎస్సై ఆర్వీఎన్ మూర్తి తెలిపారు. ఒకరి వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తహసీల్దార్‌కి నివేదిక సమర్పించామని వెల్లడించారు.