శ్రీశైలం: ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు పాల్గొన్న వ్యవసాయ అధికారులు
నంద్యాల జిల్లా కరివేన గ్రామంలో నిర్వహించిన "రైతన్న మీకోసం" కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి హేమలత గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉండటంతో పాటు ఎల్‌నినో ప్రభావం పంటలపై పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల రైతులు బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటలతో పాటు పప్పుధాన్యాల పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ విధానం ఎలా ఉంటుందో వివరిస్తూ, ఎరువుల సరఫరాలో పారదర్శకత మరియు సులభత కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు.