శ్రీశైలం: ఎరువులు మరియు పురుగుమందులు అధిక ధరలకు అమ్మితే చర్యలు మహనంది మండల అగ్రికల్చర్ ఏవో నాగేశ్వర్ రెడ్డి
ఎరువులు మరియు పురుగుమందులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని ఏవో నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో విజిలెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేశారు.మహానందీశ్వర ఏజెన్సీస్ ఎరువులు మరియు పురుగుమందుల దుకాణంలో రిజిస్టర్ లో నిల్వలకు,భౌతిక నిల్వలకు తేడాలు ఉన్నందున రూ.1,43,800 విలువచేసే 3.7 తన్నుల ఎరువులు అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగిందన్నారు.ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని, అనుమతులు ఉన్న ఎరువులు,పురుగుమందులు మాత్రమే అమ్మాలన్నారు.అనుమతులు ఉన్న ఎరువులను మాత్రమే అమ్మాలన్నారు