శ్రీశైలం: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన బండ ఆత్మకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని దాసరి త్రివేణి
బండి ఆత్మకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని, వీపనగండ్ల గ్రామానికి చెందిన దాసరి త్రివేణి పదో తరగతి ఫలితాల్లో 583 మార్కులతో సత్తా చాటింది. వ్యవసాయ పనులు చేసే చెన్నయ్య, రత్నకుమారి దంపతుల కుమార్తె అయిన త్రివేణి పట్టుదలతో చదివి టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సయ్యద్ రాఫీ, ఉపాధ్యాయ బృందం త్రివేణిని ప్రత్యేకంగా అభినందించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.