శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ,తెలుగుదేశం పార్టీలో చేరిన 80 మైనార్టీ కుటుంబాలు
శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 9వ వార్డు మాజీ కౌన్సిలర్, మైనార్టీ యువనేత సుల్తాన్ బాషా సుమారు 80 కుటుంబాలతో కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సుల్తాన్ బాషా చేరికతో శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని వారు వెల్లడించారు.