శ్రీశైలం: కృష్ణానది వెంబడి నిషేధమున్న చేపలు పడుతున్న 15 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు
కృష్ణ నది వెంబడి రెండు నెలల పాటు చేపలు పట్టడం నిషేధం ఉన్న చేపల వేట కొనసాగిస్తున్న 15 మంది మత్స్యకారులను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.శ్రీశైలం డ్యాం దిగువన కృష్ణానది వెంబడి శ్రీశైలం రేంజ్ శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది డ్రోన్ కెమెరా సహాయంతో లింగాలన్ గట్టు పెద్ద బ్రిడ్జి సమీపంలో వేటసాగిస్తున్న 15 మంది మత్స్యకారులను అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.