అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో 2024-2025 అకాడమిక్ సంవత్సరం ఇంకా పూర్తి కాకముందే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు 2026-2027 సంవత్సరానికి సంబంధించి ముందస్తు అడ్మిషన్లు సేకరిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట సోమవారం పీడీఎస్ యూ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ నియోజకవర్గ కార్యదర్శి వి.వినోద్ మాట్లాడుతూ గుంతకల్లు పట్టణంలో సెలవు దినాల్లో కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా గడప గడపకి తిరుగుతిన్నారని అన్నారు.