వికారాబాద్: రౌడీషీటర్లు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం: వికారాబాద్ టౌన్ సీఐ నాగరాజు
శుక్రవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ చెడు ప్రవర్తనను మార్చుకొని సత్ప్రవర్తన తో నడుచుకోవాలని, వికారాబాద్ టౌన్ సిఐ నాగరాజు తెలిపారు. పట్టణ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసిన, కబ్జాలు, ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.