వికారాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా కఠినంగా నిర్వహించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠినంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.