వికారాబాద్: శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్
మార్చి 3వ తేదీన ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 3న ఆదివారం జాతీయ పోలియో దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.