వికారాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో వికారాబాద్ జిల్లాకు 359 పోస్టులు
ఈరోజు గురువారం విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్ లో వికారాబాద్ జిల్లాకు టీచర్ ఉద్యోగాలు 359 పోస్టులు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్లు 102,భాషా పండితులు 23, పీఈటి 5, ఎస్జిటి 195,స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు 6,స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటిలు 28,కలిపి మొత్తం 359 పోస్టులు వికారాబాద్ జిల్లాకు కేటాయించారు.